ఎమ్మార్పీఎస్ కు ఓటు వేయాలి : కందుకూరు సోమన్న

నవతెలంగాణ – తిరుమలగిరి 
ఎస్సీ వర్గీకరణ తోనే మాదిగల అభివృద్ధి సాధ్యమని వర్గీకరణ జరగకుండా ఇంకా ఎన్నేళ్లు రాజకీయ పార్టీలకు ఓట్లేసి గెలిపించిన మాదిగల బతుకులు మారవని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కందుకూరి సోమన్న అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో 13వ వార్డులో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్  గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి (భువనగిరి పార్లమెంట్ఇన్చార్జి)  కందుకూరు సోమన్న మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలకు గతంలో తీవ్ర అన్యాయం జరిగిందని.కేవలం వర్గీకరణ జరిగిన 4 సంవత్సరాలు కాలం మాత్రమే మాదిగ విద్యార్థులకు 22 వేల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటేనే మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలకు విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా సరైన వాటా లభిస్తుందని తద్వారా మాదిగల పేదరికం అసమానతలు తొలగిపోతాయని తెలిపారు. వర్గీకరణ చేయకుండా 10 సంవత్సరాలు  మాదిగల్ని నమ్మించి  మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మాదిగ వాడల్లో పూర్తిగా బహిష్కరించాలని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో  ఎస్సీ జనాభాలో అత్యధిక శాతం జనాభా గల మాదిగలకు ఒక్కఎంపీ  సీటు కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి  సిగ్గుచేటని తెలిపారు.తెలంగాణలో మాదిగల అస్తిత్వాన్ని రాజకీయ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ను పూర్తిగా మాదిగలు రాజకీయ సమాధి  చేయాలని విజ్ఞప్తి చేశారు.చదువుకున్న మాదిగ విద్యార్థుల మేధావులు అందరూ కలిసి మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఈసారి ఎన్నికల్లో మన గ్రామములో మన కుటుంబంలో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్,బి ఆర్ఎస్ పార్టీల కు వేయవద్దని,వర్గీకరణ సాధనకు కేంద్ర క్యాబినెట్ ఉన్నత స్థాయి కమిటీ వేసి  సుప్రీంకోర్టులో లీగల్ ప్రక్రియ పూర్తి చేసిన గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బిజెపి పార్లమెంట్  అభ్యర్థులకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మన భువనగిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని  అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీను,ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు పడిశాల ప్రశాంత్,వికలాంగుల కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు. వేముల వెంకన్న, ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి టౌన్ ఇన్చార్జి కందుకూరి మహేష్,కందుకూరి మల్లయ్య కందుకూరి యాదగిరి,వంగాల పరుశరాములు,చుక్క నాగార్జున్,కొంగరి సోమ్మల్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love