ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట

నవతెలంగాణ – శంకరపట్నం
ప్రతి ఏటా ఏరువాక పౌర్ణమి సందర్భంగా శనివారం శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కాటo వెంకటరమణారెడ్డి, ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి కప్పతల్లి ఆటా ఆడుకుంటూ గ్రామంలోని భూలక్ష్మి, శ్రీలక్ష్మి, బొడ్రాయి, శ్రీఆంజనేయ స్వామి, పోచమ్మతల్లి, ఎల్లమ్మతల్లి, పెద్దమ్మతల్లి, కట్టమైసమ్మ, తల్లి దుర్గమ్మ,మల్లన్న, దేవాలయాల్లో, జలాభిషేకం చేసుకుంటూ భక్తుల భజనల మధ్య భక్తిశ్రద్ధలతో చెరువు మత్తడి వద్దకు పోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేస్తూ  కప్పను చెరువులో వదిలారు. అనంతరం సాయంకాలం శ్రీ వాలి సుగ్రీవ ఆంజనేయ రామాలయంలో పూజారి మురళీకృష్ణమాచారి మంత్రోచ్ఛరనాల మధ్య భక్తుల కరతాల ద్వనులు భజనలు చేసుకుంటూ మహిళలు భక్తిశ్రద్ధలతో కొత్త కుండలోపాశం వండి ఆ యొక్క వరుణ దేవునికి వరద పాశం చేశారు.
Spread the love