కాటమయ్య రక్షక కవచం… ప్రమాదాలకు రక్ష

Katamayya is a protective shield... a protection against accidents– గీత కార్మికులకు అండగా ఉంటాం
– రాష్ట్ర ప్రధాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ప్రమాదాలు జరగకుండా ఉండేలా కాటమయ్య రక్షక కవచాలను అందిస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సిద్దిపేట ఆధ్వర్యంలో కాటమయ్యా రక్షక కవచములు (సేఫ్టీ కిట్స్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 300 ,రెండవ దశలో 500 కిట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. గీతా కార్మికులు రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలన్నారు. రక్షక కవచాలు పెట్టుకొని తడిచెట్లు ఎక్కితే ప్రమాదం జరగదన్నారు. జూన్ తరువాత తెలంగాణ లో 40 లక్షల తాటి ఈత మొక్కలు పెంపకం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చెరువు కట్టలు స్థలాలు ఏర్పాటు చేస్తుందని అదేవిధంగా బోర్లు సంక్షన్ చేస్తామన్నారు. ఫారెస్ట్, ఎక్సైజ్ ,పంచాయతీ రాజ్ శాఖ చెట్లు పెంచి పెరగడానికి నీళ్ళు పోయడానికి గీతా పారిశ్రామిక శాఖ తో సమన్వయం చేసుకోవాలన్నారు. హైదారాబాద్ లో ఉన్న నీరాకేఫ్ టూరిజం నుండి గీతా పారిశ్రామిక కార్పొరేషన్ కి అప్పగించడం జరిగిందన్నారు. గీత కార్మికులకు ప్రభుత్వం అంండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ , సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, గీతా కార్పొరేషన్ ఎండి ఉదయ్ , హుస్నాబాద్ , కోహెడ ,సైదాపూర్ మార్కేట్ కమిటీ చైర్మన్ లు తిరుపతి రెడ్డి , బోయిని నిర్మల ,సుధాకర్, మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంత్రి హుస్నాబాద్ లోని వైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏసీ కమ్యూనిటీ హల్ కు రూ. 45 లక్షలు మంజూరు చేసిందన్నారు. హుస్నాబాద్ లో పలు ఇన్స్ట్యూట్ లు ,పరిశ్రమలు వస్తున్నాయని, వ్యాపారాలు మరింత అభివృద్ధి జరగాలని కోరారు. హుస్నాబాద్ లోనే అన్ని రకాలుగా దొరికేలా వ్యాపారాలు ఉండాలన్నారు. అందరూ హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ,అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్యవైశ్య సంఘం నేతలు పాల్గొన్నారు.

Spread the love