- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా సోమవారం సాయంత్రం స్వల్ప గాయమైంది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని తన మనవడు హిమాన్షును పరామర్శించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ కనిపించారు. కాగా కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకొని హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -



