నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని, ఇందుకోసం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సదరు ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ‘డిజిటల్ గవర్నెన్స్’ దిశగా చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



