నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి..

– ఎమ్మెల్యే ఆదిపై బిఆర్ఎస్  నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన రూరల్ కాంగ్రెస్ పార్టీ నేతలు..
– సచ్చిన, బతికిన నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఉండే గొప్ప వ్యక్తి  ఆది..
– బీఆర్ఎస్ నేతలపై మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ ఫైర్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి..రానున్న రోజుల్లో పార్టీలో ఫైంట్లు సదురుకునేటోళ్లు, కుర్చీల కోసం కొట్లాడేవాళ్ల మా నాయకుని గురించి  మాట్లాడేది..
పార్టీలు పీరయించే నేతల్లారా ఖబడ్దార్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి..సచ్చిన, బతికిన నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఉండే గొప్ప వ్యక్తి  ఆది..బిఆర్ఎస్ నేతలపై మాజీ ఎంపీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగు వెంకటేశం గౌడ్ ఫైర్ అయ్యారు..వేములవాడ ఎమ్మెల్యే సచ్చినా బ్రతికిన ప్రజల కష్టసుఖాల్లో ఉండే గొప్ప నాయకుడు అని  వేములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. శుక్రవారం చెక్కపల్లి గ్రామంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గురువారం రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను రూరల్ మండలం మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ తీవ్రంగా ఖండించారు.
10 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండి కుర్చీ కోసం తహతహలాడుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా మీకు మా నాయకున్ని విమర్శించే స్థాయి లేదని దుయ్యబట్టారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనునిత్యం ప్రజల మధ్య ఉండి 5వ సారి ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి ఆది శ్రీనివాస్ అని, ఎన్నికల్లో బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలిస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. గత ఎమ్మెల్యే కరోనా కష్ట కాలంలో నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలను వదిలి ఏండ్లకొద్దీ  పరాయి దేశం జర్మనీ వెళితే ఒక్కరు కూడా ముందుకు వచ్చి ప్రశ్నించలేదని ఇప్పుడు గల్ఫ్ కార్మికుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు దుబాయ్ వెళ్లిన బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ పై లేనిపోని నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందించి పేద కుటుంబాలను ఆదుకున్నాడని వివరించారు.  పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రాష్ట్రంలో నియోజకవర్గంలో కనుమరుగు అవటం ఖాయమని తమ ఉనికిని చాటుకునేందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయించే నేతల్లారా.. సీట్ల కోసం కుర్చీలు లాక్కునే నాయకుల్లారా ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  వకులాభరణం శ్రీనివాస్,  బొడ్డు రాములు, శ్యామల గోవర్ధన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షుల రోoడి  రాజు, బండ శ్రీనివాస్, సోషల్ మీడియా  కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్ ,గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లా గౌడ్, అడికే శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, నరసయ్య, పాలకుర్తి పరశురాములు, అనిల్, జైపాల్ రెడ్డి, రోమాల ప్రవీణ్, రమణారెడ్డి, తిరుపతి రెడ్డి, రాజు, గంగాధర్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love