ఓటు విలువ తెలుసుకో..

ఓటంటే ఒట్టి మాటల కోట కాదు
ఓటంటే ప్రజాస్వామ్య బాట
ఓటంటే ఇంకు చుక్క కాదు
ఓటంటే వ్యవస్థనే
మార్చుకునే వెలుగు చుక్కఓటంటే ఒట్టి మాటల కోట కాదు
ఓటంటే ప్రజాస్వామ్య బాట
ఓటంటే ఇంకు చుక్క కాదు
ఓటంటే వ్యవస్థనే
మార్చుకునే వెలుగు చుక్క
ఓటంటే చిత్తుకాగితం కాదు
ఓటంటే ప్రజా చైతన్యగీతం
ఓటంటే కీర్తి కిరీటం కాదు
ఓటంటే స్ఫూర్తీ పోరాటం
ఓటంటే అసామాన్య స్వరబాణి కాదు
ఓటంటే సామాన్య జనవాణి
ఓటంటే అమ్ముకునే సరుకు కాదు
ఓటంటే నీ అంబులపొదిలో శరము
ఓటంటే అపరిచిత పదం కాదు
ఓటంటే ఆత్మశుద్ది వాక్యం
ఓటంటే స్వార్థాల వ్యవహారం కాదు
ఓటంటే నిస్వార్థాల సమహారం
ఓటంటే నిన్ను ఎత్తుకునే సంపతి కాదు
ఓటంటే నున్ను హత్తుకునే సోపతి
ఓటంటే రాచరికపు పీఠం కాదు
ఓటంటే రాజ్యాంగపు పాఠం
ఓటంటే వాగ్దానాల వర్షం కాదు
ఓటంటే వమ్ముకాని హర్షం
ప్రజాస్వామ్య పరిరక్షణకే ఈ యుద్ధం
బాధ్యతగా వేసే ఓటే ప్రగతికి అద్దం..!
డా.కటుకోఝ్వల రమేష్‌
సెల్‌: 9949083327

Spread the love