Kohli… విరాట్ కోహ్లీ 50వ సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ తరం క్రికెటర్ లలో ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ చాలా గొప్ప ఆటగాడని చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని చరిత్రలో నిలిచిపోయాడు. ఇక తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లోనూ చెలరేగి ఆడుతూ ఇండియాకు మరిన్ని విజయాలను అందించాడు. ఈ రోజు ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి సెమి ఫైనల్ లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు.ఈ మ్యాచ్ లో 50వ సెంచరీ పూర్తి చేసి సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్ భారత్ భారీ స్కోరు దిశగా వెళ్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ (47) మెరుపులు మెరిపించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో ఓపెనర్ గిల్ తో ఇన్నింగ్స్ ను చక్కదిద్డాడు గిల్ వీర భాదుడు బాది అర్ద సెంచరీ పూర్తి చేశాడు. గిల్ 79 పరుగుల వద్ద కాలు నోప్పితో రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు. తన స్థానంలో క్రిజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దూకూడుగా ఆడుతూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 43 ఓవర్లకు 314/1గా ఉంది. క్రీజులో కోహ్లీ 107, శ్రేయస్ అయ్యార్ 74 పరుగులతో ఉన్నారు.

Spread the love