టీమిండియా వరల్డ్ కప్ జట్టు

వన్డే ప్రపంచ కప్‌నకు భారత జట్టు
వన్డే ప్రపంచ కప్‌నకు భారత జట్టు

నవతెలంగాణ హైదరాబాద్: అక్టోబర్‌ 5 నుంచి ఇండియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 15 మందితో జట్టుని ఎంపిక చేసింది. ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌లకు అవకాశం దక్కింది. సీనియర్ స్టార్ పేసర్ బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు.
శార్దూల్ ఠాకూర్, హార్దిక్‌ పాండ్యను పేస్‌ ఆల్‌రౌండర్లుగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా అవకాశం కల్పించారు. యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.. కుల్‌దీప్‌ యాదవ్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా తీసుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతోపాటు వికెట్ కీపర్‌ సంజు శాంసన్‌కు అవకాశం దక్కలేదు. అక్టోబర్‌ 5 నుంచి ఇండియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌

Spread the love