కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు గాయం


మిర్‌పూర్‌:
టీమిండియా క్రికెట‌ర్‌ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. బంగ్లాదేశ్‌తో మిర్‌పూర్‌లో జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డేలో కెప్ట‌న్ రోహిత్ బొట‌న వేలికి గాయ‌మైంది. ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం బీసీసీఐ మెడిక‌ల్ బృందం అత‌న్ని ప‌రీక్షిస్తోంది. రోహిత్‌కు స్కానింగ్ చేసిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మ‌రో వైపు రెండో వ‌న్డేలో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తాజా స‌మాచారం మేర‌కు 14 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 57 ర‌న్స్ చేసింది. ఫ‌స్ట్ వ‌న్డేలో బంగ్లా నెగ్గిన విష‌యం తెలిసిందే.

Spread the love