ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవము

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవము
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవము
నవతెలంగాణ తాడ్వాయి
తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అధ్యాపకులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండారి సంజీవులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చేందుకు ఉపాధ్యాయుడు నిచ్చెనల వ్యవహరిస్తారని తెలిపారు. గురువు లేనిదే ఏది సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ న్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Spread the love