కేసిఆర్ చిత్రపటాలకు వివోఏల పాలాభిషేకం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి 

మండలంలోని బషీరాబాద్  గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు వివోఏలు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విఓఏల గౌరవ వేతనాన్ని రూ.8వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ సక్కారం అశోక్ ఆధ్వర్యంలో కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి వివోఏలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు వివోఏలు మాట్లాడుతూ… ఐకేపి లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తమ వేతనం రూ. 5వేల 900 నుంచి రూ.8 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 442 ను జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.రాఖీ పౌర్ణిమ కానుకగా మహిళా సంఘాల కోసం పనిచేస్తున్న వివోఏల వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.  వేతనాన్న పెంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ  కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి విక్రమ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సిసి భాగ్యలక్ష్మి, వివో లు రజిత, కృష్ణవేణి, లావణ్య, భాగ్యలక్ష్మి, మహిళా ప్రతినిధులు గంగామణి, మైస లక్ష్మి, శ్రీ లక్ష్మి, స్వప్న, సక్కారం చిన్నక్క, నల్ల లక్ష్మి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బైకాని మహేష్, నాయకులు ఎన్. మోహన్, తోట అప్పయ్య, బందెల రాజు, ప్రశాంత్,  ఎన్. రమేష్, అధ్యక్షులు బాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Spread the love