కేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

నవతెలంగాణ- కంటేశ్వర్

కేర్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవము పురస్కరించుకొని కళాశాల ఆవరణంలో మహిళ అధ్యాపకులను, కళాశాల అధ్యాపకులను తీర డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ ఘనంగా శాలువాతో సత్కరించి బొక్కెను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మొదట తల్లిదండ్రులు గురువులైతే ఆ తరువాత అధ్యాపకులు తల్లిదండ్రుల స్థానానికి వెళ్లి గురువులౌతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వైస్ ప్రన్సిపల్ నరేష్, సందేశ్, సందీప్  కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love