ఉపాధి హామీ కూలీలకు వారం వారం పే స్లిప్పులు ఇవ్వాలి: కొండమడుగు నర్సింహ

– 6 వారాలు గడిచినా రోజు కూలీ ఎంత వస్తుందో తెలియక అయోమయంలో ఉపాధి కూలీలు

– పనిచేస్తున్న కార్మికులకు పే స్లిప్ లు ఇవ్వరు, సంవత్సరం నుండి డబ్బులు ఇవ్వరు
– వారం వారం పే స్లిప్ ఇచ్చి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ డిమాండ్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్

6 వారాలుగా ఎండలో మాడిపోతు పనిచేస్తు చేతులకు బొబ్బలు వచ్చిన రెక్కాడితే డొక్కాడని కూలీలు కుటుంబ పోషణ కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న రోజు కూలీ ఎంత వస్తుందో తెలియక అయోమయానికి గురై కూలీలు ఆవేదన చెందుతున్నారని,పనిచేస్తున్న కార్మికులకు పే స్లిప్ లు,డబ్బులు ఎందుకు ఇవ్వరని, ఆరు వారాల నుండి కార్మికులకు పే స్లిప్ లు ఇవ్వకుండా,పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మండలం ఉన్న ఏపిఓ,టిఎలు ఏమిచేస్తున్నారని ఇప్పటికైనా పే స్లిప్ లు వారం వారం ఇచ్చి,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.గురువారం చౌటుప్పల్ మండల పరిధి లోని జై కేసారం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేసి వారి సమస్యలను తెలుసుకున్నా అనంతరం నర్సింహ మాట్లాడుతూ పేదలు వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన, వామపక్ష పార్టీల ఎంపీల చొరవతో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ప్రతి సంవత్సరము నిధులు తగ్గిస్తూ ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.కొత్త కొత్త జీవోలను విడుదల చేస్తూ చట్టాన్నె నీరుగార్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.2005లో చట్టము వచ్చినప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కార్మికులకు చేస్తున్న పనికి రోజువారి కూలి ఎంత వస్తుందో తెలియజేయడానికి పే స్లిప్ లు ఇవ్వాలని ఉన్న ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు. వారం వారం చేసిన పని డబ్బులు చెల్లించాలని ఉన్నా మూడు, నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో పని చేస్తున్న కార్మికుల కుటుంబాలను ఏవిధంగా పోషించుకుంటారని ప్రశ్నించారు.చట్టం ప్రారంభదశలో కూలీల పని ప్రదేశంలో దగ్గర తాగడానికి మంచినీళ్లు,నీడ కోసం టెంటు,పని ప్రదేశంలో గాయపడితే మెడికల్ కిట్టు, చంటి పిల్లలను ఎత్తుకోవడానికి ఆయాలు ఉండేవారని.నేటి మోడీ పాలనతో వీటన్నింటినీ తగ్గించి కూలీలను ఉపాధి పనికి రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి ఉన్నదని అన్నారు.18 సంవత్సరాల క్రితం పనిచేసే కూలీలకు పనిముట్లు ఇవ్వగా ఆ తర్వాత నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరికి కూడా నూతన పనిముట్లు ఇవ్వలేదని కూలీలే సొంత డబ్బులతో నూతన పనిముట్లు కొనుక్కొని పనికి పోతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు.ఆ పనిముట్లు పనికి యోగ్యంగా తయారు చేసుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువులు పెద్దఎత్తున పెరుగుతుంటే ఉపాధి హామీ పథకంలో 272 రూపాయలు ఇవ్వాలని ఉన్న కేవలం 100 నుండి 150 రూపాయలు దాటడం లేదని దీంతో కూలీల కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం చట్టంలో ఉన్న ప్రకారం పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని,సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని,రోజుకూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షల రూపాయలు, చనిపోతే 20 లక్షల రూపాయలు, పని ప్రదేశంలో గాయపడిన వారికి వైద్యం ఖర్చు తో పాటు పనిచేయని రోజులలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినారు.క్యూబిక్ మీటర్తో సంబంధం లేకుండా రోజు కూలి నిర్ణయించిన ప్రకారం 272 రూపాయలు చెల్లించాలని,కాంగ్రెస్ పార్టీ హాామీల ప్రకారం రోజు కూలి 350 పెంచాలని,ఉపాధి పని చూపని దగ్గర నిరుద్యోగ భృతి చెల్లించాలని, దూరప్రాంతాలకు పనికి వెళ్లే కార్మికులకు ప్రయాణ చార్జీలు చెల్లించాలని కొండమడుగుుు నరసింహహ డిమాండ్ చేశారు.పని జరుగుతున్న ఉపాధి కూలీలల వద్దకు వచ్చిన ఏపిఓ కూలీల సమస్యల పైన కొండమడుగు నరసింహ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగదేవి సైదులు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మదుకృష్ణ తెలంగాణ వడ్డర సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొదాసు వెంకటేష్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యులు బోయ యాదయ్య,మానే సాలయ్య, మండల ఉపాధ్యక్షులు పొట్ట వెంకటయ్య,యాట బాలరాజు నాయకులు మాదగోని మారయ్య,ఉపాధి హామీ కార్మికులు తలాటి భాగ్యమ్మ,దొడ్డి రాములమ్మ,తలాటి శోభ,అంతటి ప్రభావతి, మాధగోని అనూష,రుద్రగోని శ్యామల,గంగాదేవి దేవి,కంచర్ల శంకరమ్మ,పొట్ట జంగమ్మ,దొడ్డి మమత, తలాటి రేణుక,ఢిల్లీ నర్సిరెడ్డి,గోపాల్,గంగాదేవి లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love