ప్రచారంలో పాల్గొన్న కోటపాటి..

నవతెలంగాణ – ఆర్మూర్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోసం పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించినారు. ఓరిస్సా రాష్ట్రంలోని  సంబల్ పూర్. పార్లమెంటరీ స్థానం నుండి పోటీ చేస్తున్న కేంద మానవ వనరుల శాఖామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పోటీ చేస్తున్నారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కేంద్ర విద్యా మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. వారి ఆహ్వానం మేరకు నాలుగు రోజుల క్రితం సాంబాల్పూర్ చేరుకున్న రాష్ట్ర నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు ఆర్మూర్ మార్కండేయ మందిరం కమిటీ చైర్మన్ కొక్కుల విద్యాసాగర్ లు ( హిందూ వారియర్స్ నాయకుడు) సాంబార్ పూర్ చేరుకొని అక్కడే మకాం వేసి, అక్కడ ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్లి స్థిరపడిన తెలుగు ప్రజలను కలుస్తూ, బిజెపి కి మద్దతు కూడా గడుతున్నారు. సంబల్ పూర్ లో స్థిరపడిన ఇక్కడి విద్యాసంస్థలు, హాస్పిటల్స్ నిర్వహిస్తున్న ఆంధ్ర మూలలు కలిగిన మురళీకృష్ణ సహకారంతో ఆంధ్ర ప్రజల ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20 గ్రామాలకు పైగా తిరిగి ప్రచారం చేశారు.  ఈనెల 25న ఎన్నికలు జరగనున్న సాంబార్ పూర్ నియోజకవర్గం గతంలో రెండు సార్లు గెలుచుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడి నుండి మొదటిసారి పోటీ చేస్తున్నారు భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు కోటపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.
Spread the love