అశ్వారావుపేట తహశీల్దార్ గా తిరిగొచ్చిన క్రిష్ణ ప్రసాద్

– మంగళవారం రిలీవ్..శుక్రవారం జాయినింగ్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలానికి ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల మళ్ళీ క్రిష్ణ ప్రసాద్ నే తహశీల్దార్ గా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగస్ట్ లో జరిగిన బదిలీల్లో చుంచుపల్లి తహశీల్దార్ గా పనిచేస్తున్న ఖమ్మం కేడర్ కు చెందిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ను భద్రాచలం బదిలీ చేసారు.ఆయన అక్కడ విధుల్లో చేరకుండా సెలవు పెట్టినట్లు గతంలో సమాచారం.కాగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఆగస్ట్ లో 15 రోజులుగా తహశీల్దార్ లేకుండానే పాలన సాగింది.నియోజక వర్గం కేంద్రం,ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో అనేకమంది ఆశావాహులు దృవీకరణ పత్రాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవి గుట్టలు గుట్టలు గా పేరుకు పోయాయి. ఈ క్రమంలో క్రిష్ణ ప్రసాద్ ను అశ్వారావుపేట కు బదిలీ చేస్తూ నాడు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు.
ఆయన ఆగస్ట్ 14 న అశ్వారావుపేట తహశీల్దార్ గా బాధ్యతలు తీసుకున్నారు: నియోజక వర్గం రిటర్నింగ్ అధికారిగా అదనపు కలెక్టర్ పి.రాంబాబు నేతృత్వంలో ఎన్నికల విధులు నిర్వహించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు గానీ,విధుల్లో అలసత్వం గానీ లేకుండా అసెంబ్లీ ఎన్నికలు విజయవంతం చేయడంతో పాటు నాటి ఎన్నికల ఫలితాలు విడుదల సమయంలో సైతం అశ్వారావుపేట ఫలితం మే ముందుగా విడుదల అవడం చర్చకు దారితీసింది.ఎన్నికల అధికారులు ప్రశంసలు సైతం ప్రశంసలు కుర్పించారు.ఎన్నికల విధులు విజయవంతంగా చేసినందుకు గానూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందజేసారు. ప్రస్తుతం అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో స్తానికులైన అధికారులను బదిలీ చేయాలనే ఎన్నికల నిబంధన రావడంతో ఖమ్మం కేడర్ కు చెందిన క్రిష్ణ ప్రసాద్ ను మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో గల భూర్గంపాడు కు చర్ల తహశీల్దార్ ఎం.శ్రీను ను అశ్వారావుపేట కు కలెక్టర్ ప్రియాంక అల మంగళవారం బదిలీ చేసారు. అదే రోజు క్రిష్ణ ప్రసాద్ ఇక్కడ రిలీవ్ అయి అక్కడ విధుల్లో చేరగా బుధవారం చర్ల తహశీల్దార్ శ్రీను అశ్వారావుపేట లో విధుల్లో చేరారు. అయితే అశ్వారావుపేట నియోజక వర్గం కేంద్రం మండలం కావడంతో ఎన్నికల విధుల్లో తర్ఫీదు ఉన్న తహశీల్దార్ అవసరం ఉన్నందున చర్ల తహశీల్దార్ శ్రీను కు ఎన్నికల విధుల్లో అనుభవం లేకపోవడం కారణం చేత ఎన్నికల సంఘం అధికారులకు ప్రత్యేక విన్నపం ద్వారా తిరిగి క్రిష్ణ ప్రసాద్ నే అశ్వారావుపేట కు తహశీల్దార్ గా జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తిరిగి నియమించారు. ఈ క్రమంలో ఆయన వారం తిరగక ముందే  శుక్రవారం అశ్వారావుపేట తహశీల్దార్ గా రెండోసారి విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ నుండి వెళ్ళిన ఏ తహశీల్దార్ తిరిగి రాని వైనం క్రిష్ణ ప్రసాద్ కు దక్కింది.
Spread the love