రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్షత్రియ పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలోని క్షత్రియ పాఠశాలలలో, మండలంలోని చేపూర్  నందు తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్స్  శ్రీ లక్ష్మీనరసింహస్వామి,శ్రీమతి నవితా  అల్జాపూర్ అక్షయ్ జ్యోతి ప్రజ్వలన గావించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ దృశ్య,శ్రవణ మాధ్యమం ద్వారా తమ సందేశాన్ని పంపిస్తూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తి భారత ప్రభుత్వాన్ని ఆలోచింపజేసిందని అని అన్నారు. ఈ సందర్భంగా 1969 నాటి పోలీసుల కాల్పుల ఘటన తన మనస్సును ఎంతో  చలింపజేసిందని తెలియజేసారు. నాగారంలోని రాజారాం స్టేడియంలో నిర్వహింపబడిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో క్షత్రియ విద్యార్థులు. కె. ప్రణతి స్టాండింగ్ జంప్ లో  కొప్పుల రాంచరణ్, మార్వాడి  విఘ్నేష్, కొప్పుల వర్షిణి  వ్యక్తిగత పరుగు పందెం పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానాన్ని పొంది విజేతలుగా నిలిచినారు. ఈ నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినారు. ఈ సందర్భంగా క్షత్రియ పాఠశాల ప్రిన్సిపల్  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విద్యార్థులను అభినందించి నారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ అక్షయ్, టీచర్స్ కాలనీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ మతి నవిత పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love