- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరుల దాడిని కేటీఆర్, హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు.
- Advertisement -



