Saturday, May 16, 2026
E-PAPER
Homeజాతీయంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్..!

విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ చేస్తున్న వాదనతో గవర్నర్ ఆర్వీ అర్లేకర్ ఇంకా సంతృప్తి చెందలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది.

గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు విజయ్‌ను పిలిపించిన గవర్నర్ అర్లేకర్, ఆయన ముందు పలు కీలక ప్రశ్నలు ఉంచారు. అసెంబ్లీలో మెజారిటీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, కేవలం 108 మంది సభ్యులున్న టీవీకే ఎలా ప్రభుత్వాన్ని నడుపుతుందని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఏయే పార్టీలు మీకు మద్దతు ఇస్తున్నాయో స్పష్టం చేయాలని కోరారు. బుధవారం కూడా విజయ్‌తో భేటీ అయిన గవర్నర్, ఆయన ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -