ఆర్టీఐ కాటారం సబ్ డివిజన్ ఇంచార్జిగా కుమార్ యాదవ్

– ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా అధ్యక్షుడు
నవ తెలంగాణ –  మల్హర్ రావు
సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక కాటారం సబ్ డివిజన్ లోని మహాదేవపూర్, మల్హర్, కాటారం,మహాముత్తారం, పలిమేల  ఐదు మండలాలకు ఇంచార్జిగా మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన చింతల కుమార్ యాదవ్ ను నియమించినట్టు సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి, నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు సమాచార హక్కు చట్టం బలోపేతం చేయడంలో భాగంగా సమాచార హక్కు చట్ట ఉద్యమకారునిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన, పాలన పారదర్శకత పెంచడానికి ఈ చట్టం దోహద పడుతుందన్నారు.తనను సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక కాటారం సబ్ డివిజన్ ఇంచార్జిగా నియంయించిన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్ కు కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి,హర్షం వ్యక్తం చేశారు.కాటారం సబ్ డివిజన్ లోని ఐదు మండలాల్లో సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా కుమార్ యాదవ్ ప్రకటించారు.
Spread the love