లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

Labor codes should be abolished.నవతెలంగాణ – భువనగిరి
కార్మిక ప్రజా వ్యతిరేకి మోడీకి పరిపాలించే హక్కు లేదని, మోడీ  వెంటనే గద్దె దిగాలనీ  అఖిల భారత రైతు సంఘం  ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రోజున మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిషన్ మోర్చా ఎస్ కె ఎం జాతీయ కమిటీలు ఇచ్చిన  పిలుపు మేరకు భువనగిరి  రైల్వే స్టేషన్ నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించారు.ప్రిన్స్ చౌరస్తా వద్ద  సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన సభ జరిగింది.ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన  రైతు సంఘం అల్ ఇండియా ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య  హాజరై మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు నష్టం చేసే చట్టాలను తీసుకువచ్చిన చరిత్ర మోడీదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడి మోడీ మెడలు వంచిన చరిత్ర ప్రజా పోరాటానికి ఉన్నదని గుర్తుచేశారు. పార్లమెంట్ సాక్షిగా రైతు చట్టాలను రద్దు చేస్తానని చెప్పిన మోడీ నేటికి వాటిని రద్దు చేయలేదని దేశ ప్రజలను నమ్మించి గొంతు కోసాడని విమర్శించారు. పోరాడి కార్మిక వర్గ సాధించుకున్న 29  కార్మిక చట్టాలను  రద్దు చేసి నూతన లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని పలితంగా కార్మికుల 8 గంటల పని 12 గంటలకు పెరిగే ప్రమాదం ఉన్నదని లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను  ప్రజలకు నష్టం చేసే నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. మోడీ కి ప్రజలను పాలించే హక్కు లేదని తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసి జిల్లా అధ్యక్షులు సుడుగు జీవన్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘo జిల్లా ప్రధాన కార్యదర్శులు మాటూరు బాలరాజ్ గౌడ్ , కొల్లూరి రాజయ్య,  జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవ రెడ్డి ,బిసి సాధన సమితి జిల్లా కార్యదర్శి ఎశాల అశోక్ ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఐ ఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గడ్డం నాగరాజు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంగ నర్సింహులు,కోమటిరెడ్డి చంద్రా రెడ్డి ,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు  గొరిగె సోములు,మాయ కృష్ణ, బోడ భాగ్య, గడ్డం ఈశ్వర్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాలు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఐఎన్ టీయుసి జిల్లా నాయకులు కోళ్ల కృష్ణ, ప్రజ్ఞా నాయక్ ,ప్రజా సంఘాల నాయకులు బబ్బూరి పోశెట్టి, దయ్యాల నరసింహ, పుప్పాల గణేష్ ,పోతరాజ్ జహంగీర్ ,పల్లర్ల అంజయ్య ,దాసరి లక్ష్మయ్య ,జిట్ట అంజిరెడ్డి ,చిరబోయిన రాజయ్య ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్, పంజాల మురళి వంగాలనరసింహారెడ్డి, చిరబోయిన కొమురయ్య పాల్గొన్నారు.
Spread the love