
హమాలి కార్మిక సంఘం నాయకుడు బొల్లి చంద్రయ్య మరణం కార్మిక లోకానికి తీరనిలోటని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 6 వార్డూలోని చేనేత కాలనిలో నివాసం ఉంటున్న బొల్లి చంద్రయ్య మృతి చెందడంతో బుధవారం హమాలి కార్మికులతో కలిసి బొల్లి చంద్రయ్య భౌతికకాయాన్ని సందర్శించి పులమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చామంతుల మల్లయ్య, అవుల చంద్రయ్య, దొంతరబొయిన రాజయ్య, దొంతరబొయిన కనకయ్య ,పుసాల, అనిత, సునిత, సూజాత, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.