ఐకేపీలో లక్పతి దీదీ శిక్షణ

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఎన్ ఆర్ ఎల్ ఎం పథకంలో లక్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా టిఒటి శిక్షకులు జిల్లా ఐబీ డీపీఎం సుధాకర్ మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న 55 గ్రామ సంఘాలలో 80 మంది సభ్యులను గుర్తించి వారి వివరాలు మొబైల్ లో డాటా ఎంట్రీ చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు లక్షాధికారి అయ్యేవిధంగా లక్పతి దిధిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో బీర్కూరు ఏపీఎం గంగాధర్, భిక్నూర్ ఏపీఎం శ్రీనివాస్, సీసీలు వెంకటేష్, రాజేశ్వరి, జయశ్రీ, శ్రీనివాస్, మాధురి, స్వాతి, ఆపరేటర్ నరేష్, అకౌంటెంట్ అన్నపూర్ణ, 42 గ్రామ సంఘాల వివోఏలు పాల్గొన్నారు.
Spread the love