మంథని ఆర్డీవో కార్యాలయం ముందు భూనిర్వాసితుల నిరసన…

నవతెలంగాణ – మంథని
మంథని ఆర్డీవో కార్యాలయం ముందు జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.మంథని ఆర్డిఓ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రైతులకు తెలియకుండానే అధికారులు అవార్డు పాస్ చేయడానికి చేసిన చర్యలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని నినాదాలు చేశారు.రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరువ చూడడం లేదని ఆరోపించారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నినాదాలు చేశారు.మంథని ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భూనిర్వశితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూనిర్వశితులకు రైతులకు తెలియకుండా అవార్డు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.సంఘటన స్థలానికి మంథని పోలీసులు చేరుకొని భూ నిర్వాసితులతో మాట్లాడారు.తమ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసులకు వివరించారు.ఆర్డిఓ స్పందించి భూనిర్వశితులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని,జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరిస్తూ లోనికి వెళ్లిపోయారు.దీంతో మళ్లీ రైతులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చూస్తూ రైతులను శాంతింపజేసి వెలగొట్టారు.

Spread the love