భూసమస్యలు

భూమితో మానవుడికున్న అవినాభావ సంబం ధం ఈనాటిది కాదు. తెలంగాణ సాయుధ పోరాటానికి మూలమే భూమి. రైతులు, భూయజమానులుభూమితో మానవుడికున్న అవినాభావ సంబం ధం ఈనాటిది కాదు. తెలంగాణ సాయుధ పోరాటానికి మూలమే భూమి. రైతులు, భూయజమానులు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి పాత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనితో కొన్ని పరిష్కారమైనా, ఆవెంటే కొత్తవీ పుట్టుకొచ్చాయి. అందుకే ధరణిని రద్దుచేస్తామని ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ ప్రకటిం చింది. ఆమేరకే రాజకీయ, రైతు ప్రతినిధులు, రెవెన్యూతో పాటు మాజీ ఐఏఎస్‌ అధికారులతో నియమించిన ప్రత్యేక కమిటీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. కొత్తకొత్త సంస్కరణలు ఎన్ని తెచ్చినా, గత పాలకపార్టీలు సంపూర్ణ విజయాన్ని సాధించలేక పోయాయి. సామాన్య రైతులు, భూయజమానుల కష్టాలు తీరలేదు. నష్టాలకు తెరపడలేదు.
కాంగ్రెస్‌ సర్కారు ధరణిని రద్దుచేసి ‘భూమాత’ పోర్టల్‌ ద్వారా మౌళిక ఇబ్బందులకు చరమగీతం పాడతానంటుంటే, బీఆర్‌ఎస్‌ మాత్రం పేరు మార్చడం మినహా కాంగ్రెస్‌ మరేమీ చేయ లేదని రాజకీయ వేడిని రగిలిస్తున్నది. విధానాలు ఎలా ఉన్నా, భూయజ మానులు, రైతుల కోణంలోనే ఆలోచించి నూతన సంస్కరణలు తేవడం రేవంత్‌ సర్కారు ప్రథమ కర్తవ్యం కావాలి. గతంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోనే అన్నీ దస్తావేజులు జరిగేవి. ధరణి రాకతో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లు, ఇతరాలకు స్టాంపుల శాఖ, వ్యవసాయ భూములను తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అది కాగానే దస్తావేజు ఇచ్చేస్తున్నారు. ముటేషన్‌ సైతం ఆవెంటనే జరిగిపోతున్నది. వారం, పది రోజుల్లో పాసుబుక్కు వస్తున్నది. దీనిమూలంగా రైతుబంధు, ఇతర పథకాలు, రాయి తీలు అర్హులకు అందుతున్నాయి. కాగా కొందరికి రావడం లేదు. ఇదొక పార్శ్యం. మరో కోణమూ ఉంది. ధరణిలో చోటుచేసుకున్న తప్పులతో నష్టాలు సైతం తీవ్రంగానే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో భూసమస్యలు లేని గ్రామాలే లేవు. రియల్‌ ఎస్టేట్‌ ఊపం దుకున్న తరుణంలో ఇవి మరింత పెరిగాయి. పోలీస్‌స్టేషన్లు, తహసీల్దార్లు, కలెక్టరేట్లు, సీసీఎల్‌ఎ, కోర్టుల్లో కుప్పలు, తెప్పలుగా కేసులు నమోదవ ుతుండటం ఎవరికి తెలియనిది. ఇవి శాంతిభద్రతలకు సవాల్‌గా నిలుస్తున్న మాట నిజం కాదా? ధరణి లోపాలను అడ్డం పెట్టుకుని రియాల్టీ ఏజెంట్లు, భూస్వావ ుులు అధికారులతో కుమ్ముక్కయి నానాగడ్డికరుస్తున్న తీరు జుగుస్ఫాకరం.
చిన్న, చిన్న తప్పుల సవరణకు రాష్ట్రస్థాయి దాకా వెళ్లాల్సిన పరిస్థితే ధరణికి పెద్ద మైనస్‌. ఇది హక్కులను ప్రశ్నార్థకం చేస్తున్న తీరు ఆందోళనకరం. పొరపాటున ఒకరి భూమి మరోకరి పేర నమోదైతే, ఆ పాసుబుక్కును రద్దుచేసే అధికారం ఏ అధికారికి లేకపోవడం విచిత్రం. బాధితుడు కోర్టుగడప తొక్కకపోతే ఆ భూమిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి తప్పిదాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే కొత్త సర్కారుపై సంబంధీకులకు విశ్వాసం పాదుకోదు. పాసుపుస్తకాల చట్టం-1971లోని సెక్షన్‌ 26ను మార్పుచేస్తూ 2020 సెప్టెంబరు తొమ్మిదిన అసెంబ్లీ ద్వారా ధరణి చట్టమైంది. ఒక్క సవరణతో సాదాబైనామా సమస్యను కొలిక్కి తేవచ్చని నిపుణుల సలహా. ఈతరహా దరఖాస్తులు సర్కారులో 9.5లక్షలు పెండింగ్‌లో ఉండటమే బాధితుల ఆగ్రహానికి సాక్ష్యం. డిజిటల్‌ సంతకాల కోసం 1.8 లక్షల ఎకరాలకు చెందిన ఫైళ్లు, అలాగే సాంకేతికా ంశాలతో 2.31 లక్షల వినతులూ ఇంకా మూలనే ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల సవరణలో సర్కారు చేసిన తప్పులకు తామేందుకు రుసుం చెల్లించాలని రైతులు, భూ యజమానులు ప్రశ్నించడం తప్పెలా అవుతుంది ? వాటి సవరణకు బీఆర్‌ఎస్‌ సర్కారు వేసిన కమిషన్‌, ఎందుకూ గొరకాలేదు. ఆదాయం కోసం వారసత్వ ఆస్తులకు రిజిస్ట్రేషన్‌, ముటేషన్‌ ఫీజులు ధరణితో తెచ్చి చిచ్చుపెట్టారు.దీన్ని రద్దుచేయాలనే డిమాండ్‌ న్యాయమైందే.
స్వాతంత్య్రానికి మునుపు 1940లో రాష్ట్రంలో భూసర్వే జరిగింది. మళ్లీ ఆ ఊసే లేదు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే చేస్తే భూ సమస్యలు శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిం చవచ్చనే భూ, వ్యవసాయ నిపుణుల సూచన లను రేవంత్‌ సర్కారు నియ మించిన ప్రత్యేక కమిటీ పరిగణనలోకి తీసుకోవాలి. కోనేరు రంగా రావు కమిటీ సిఫారసులను అమలుచేస్తే ప్రభుత్వ, సీలింగ్‌, బంజరు భూములను పేదలకు పంచే అవకాశమూ దొరుకుతుంది. అదీ చేయాలి. రాజ కీయ పక్షాలను సంప్రదిస్తామన్న మాటనూ నిల బెట్టుకోవాలి. కౌలు రైతులకు కొత్తపోర్టల్‌లో అవ కాశముండాలి. లోపాలన్నింటిని సవరించి సరి కొత్తగా తెచ్చే భూమాత పోర్టల్‌కు అప్పుడే సార్థకత. ప్రజలకూ మేలు.

Spread the love