పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలి..

– కొత్తపల్లి శివకుమార్ సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట కుడకుడ గ్రామ శివారు నేరేడుచర్లలో గత ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద ప్రజల ఇంటి స్థలాలకు శాశ్వత పట్టాలిఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతూ సోమవారం సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ కి వినతి పత్రం  అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి నిలువ నీడలేని నిరుపేదలు కుడకుడ గ్రామం చివేముల మండలం సూర్యాపేట జిల్లా సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిలో, మరియు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గల 243 244 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో నిలువ నీడలేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనేక మార్లు గుడిసెలను తొలగించి పేదల పైన మాపైన అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టాలని చూస్తే కేసులకు ఏమాత్రం భయపడకుండా టిఆర్ఎస్ గుండాలని కొంతమంది  ఎదిరించి తిరిగి అదే స్థలంలో గుడిసెలు వేసుకొని పేదలు జీవిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని హామీ ఇచ్చారు అందులో భాగంగానే మా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఎన్, ఉత్తంకుమార్ రెడ్డి గారికి మరియు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది , సీఎం క్యాంప్ ఆఫీసు నుండి కలెక్టర్ గారికి ఎంక్వయిరీ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని లెటర్ పంపించారు కానీ రెవిన్యూ అధికారుల నుండి ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి “”సోషియో ఎకానమీ”” సర్వే జరిపి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలకు పట్టాలి ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ,పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్, హుజూర్నగర్ పార్టీ డివిజన్ కన్వీనర్ వాస పల్లయ్య ,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎస్కె హుస్సేన్, పీ . వై.ల్ జిల్లా నాయకులు వాసా కరుణాకర్ పిఓడబ్ల్యు సహాయ కార్యదర్శి సూరం రేణుక పార్టీ నాయకులు సయ్యద్, పావని, లక్ష్మీ, శ్యామల సత్యక్క మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
సూర్యాపేట జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ లో ఉన్న నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వండి పెడుతున్నారు అని కార్మికుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు ఏకలక్ష్మీ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం పిల్లలకి ఇచ్చే మెనూ చార్జీలు అప్పులు చేసే ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. రాగి జావా పెరిగిన కూరగాయల ధరలు వంద రూపాయలకు కిలో టమాట మార్కెట్లో పలుకుతా ఉన్నాయి అని అన్నారు. ఒక్క కోడిగుడ్డుకు ఏడు రూపాయలు పలుకుతా ఉన్నది కానీ పాఠశాలలో వారానికి మూడు కోడి గుడ్లు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు అని అన్నారు. సంఘం కార్మికులకు జీతాలు పెరగకపోగా ఉన్న జీతాలను కూడా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి,కొన్ని ప్రాంతాల్లో పెరిగిన 2000 ఇచ్చారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఇవ్వలేదు అని అన్నారు.పెండింగ్ ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది ఆ వేతనం వెంటనే అమలు చేయాలని అవసరమైన గ్యాస్  సబ్సిడీకి ఇవ్వాలి అలాగే గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు.అలాగే ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సంకోజు గీత, తిరుపతమ్మ ,మాణిక్యమ్మ ,పద్మ, లక్ష్మీ, విజయ, కవిత, పార్వతి, సరస్వతి, విజయలక్ష్మి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love