లారీ, ఆటో ఢీ.. ఆటో డ్రైవర్ డ్రైవర్ మృతి 

– అతివేగమే ప్రమాదానికి కారణం 
– దేవునిపల్లి ఎస్సై రాజు 
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ వద్ద శుక్రవారం లారీ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ ఆసుపత్రిక తరలిస్తుండగా మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం సుమారు 10:30 నుంచి 11 గంటల సమయంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్లోని పెట్రోల్ బంకు దగ్గర ఆటో కామారెడ్డి నుండి సదాశివ నగర్ వైపు వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా, ఆ జాగ్రత్త నడిపి ముందు వెళ్తున్న ఆటోకు టక్కరి ఇవ్వడం వల్ల ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలైనాయనీ, ఆటో  డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Spread the love