నవతెలంగాణ హైదరాబాద్: ప్రజాదరణ పొందిన తన ప్రసిద్ధ F సిరీస్ పరిణామ క్రమంతో అధిక-నాణ్యత, దీర్ఘకాలిక మన్నికను అందించే స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో OPPO India తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటూనే ఉంది. దాని మన్నిక, ఫీచర్-రిచ్ పనితీరుకు గుర్తింపు దక్కించుకున్న F సిరీస్ భారతదేశంలో గణనీయంగా అభివృద్ధి చెందడంతో పాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి దృఢమైన దరణను సంపాదించుకుంది.
F సిరీస్ పరిణామం గురించి OPPO ఇండియా ప్రొడక్ట్ కమ్యూనికేషన్స్ హెడ్ సావియో డిసౌజా మాట్లాడుతూ ఆవిష్కరణలలో భాగంగా OPPO, మన్నికతో F సిరీస్ డిజైన్ ఫిలాసఫీకి ఒక మూలస్తంభంగా మారింది. బ్రాండ్ నిరంతరం రోజువారీ జీవితంలోని కఠినతలను తట్టుకునే స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడంపై దృష్టి సారించింది- నిర్మాణ సమగ్రతను మెరుగుపరచేందుకు ప్రీమియం పదార్థాలను ఉపయోగించడం, దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం అత్యధిక IP రేటింగ్‌లను చేర్చడం ఇందులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు పడిపోవడం, కఠినమైన వాతావరణం నుంచి రోజువారీ ప్రమాదవశాత్తు జరిగే ఘటనల వరకు, F సిరీస్ నమ్మకమైన సహచరుడిగా ఉండేలా రూపొందించారు. దీనిని ప్రతిబింబిస్తూ, OPPO F27 Pro+ విడుదలైన మొదటి ఆరు నెలల్లో OPPO F25 Pro కన్నా 30% ఎక్కువ విక్రయాలతో తన ముందు తరం ఉత్పత్తుల కన్నా మెరుగైన పనితీరును కనబరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే, F27 Pro+ అదే కాలంలో F25 Pro కన్నా 25% వృద్ధిని నమోదు చేసింది. ఈ డ్యూరబిలిటీ-ఫస్ట్ విధానం మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి కీలక ప్రాంతీయ మార్కెట్లలో డిమాండ్‌ను పెంచింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, OPPO ఇప్పుడు నీరు మరియు ధూళి నిరోధకతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రాండ్ – బ్రాండ్ మన్నిక ప్రమాణాలకు ఆమోదం లభించింది.
ఈ వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, OPPO భారతదేశంలో F29 సిరీస్‌ను విడుదల చేసింది- ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించడంతో పాటు, భారతదేశంలోని సవాళ్లతో కూడిన వాతావరణాలలో పరీక్షించబడింది. అదే విధంగా, F29 సిరీస్ మిలిటరీ-గ్రేడ్ దృఢత్వం, ఉన్నతమైన కనెక్టివిటీని, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇవన్నీ సన్నని, సొగసైన డిజైన్‌లో ప్యాక్ చేయబడ్డాయి. ఈ పరికరాలు IP66, IP68 మరియు IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. దుమ్ము, వర్షం, నీటిలో పడినా రక్షణను అందిస్తాయి. మెరుగైన స్పిల్ రెసిస్టెన్స్‌లో జ్యూస్, టీ, పాలు, కాఫీ మరియు డిటర్జెంట్ వంటి రోజువారీ ద్రవాలు ఉన్నాయి. అదే విధంగా F29 సిరీస్‌లో ప్రమాదవశాత్తు కిందపడినప్పుడు షాక్‌లను గ్రహించేందుకు 360° ఆర్మర్ బాడీ కూడా ఉంది- ముఖ్యంగా నిరంతరం ప్రయాణంలో ఉండే డెలివరీ సిబ్బంది వంటి వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫోన్ 14 మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H-2022 సవాళ్లకు అనుగుణంగా పరీక్షించారు. వాటిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వర్షం, షాక్‌లు మరియు వైబ్రేషన్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ పరిశ్రమలో మొట్టమొదటి హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేస్తోంది. ఇది మారుమూల ప్రాంతాలు, అండర్‌పాస్‌లు మరియు బేస్‌మెంట్ పార్కింగ్ జోన్‌లలోనూ 300% బలమైన సిగ్నళ్లను అందిస్తుంది.
బ్యాటరీ లైఫ్‌ను కీలక అంశంగా పరిగణనలోకి తీసుకుని F29 Pro 6000mAh బ్యాటరీ, F29 6500mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. రెండు మోడళ్లలో SUPERVOOC™ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. వినియోగదారులు త్వరగా పవర్ అప్ చేయగలరని, ప్రయాణంలోనూ కనెక్ట్ అయి ఉండటాన్ని నిర్ధారిస్తుంది. ఇది 2024లో (IDC) 12% మార్కెట్ వాటాను అనుసరించి, OPPO ‘AI for All’పై దృష్టి సారించి తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా 2025లో ఈ ఊపును పెంచుకోవాలని యోచిస్తోంది. ఫోటోగ్రఫీ, ఉత్పాదకత మరియు పనితీరు అంతటా జనరేటివ్ AIని బ్రాండ్ ఏకీకృతం చేస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ టెక్నాలజీ మరియు మెషిన్ లెర్నింగ్‌లో 5,800 కన్నా ఎక్కువ AI-సంబంధిత పేటెంట్‌ల మద్దతును కలిగి ఉంది. అదే విధంగా, F29 సిరీస్ ద్వారా ప్రదర్శించబడినట్లుగా, కెమెరా టెక్నాలజీ, పనితీరు, మన్నికలో ఆవిష్కరణలు పురోగతిని కొనసాగిస్తోంది. వినియోగదారుని అనుభవాన్ని మరింత బలోపేతం చేసేందుకు OPPO తదుపరి తరం సేవా కేంద్రాలతో దాని అమ్మకాల తర్వాత సేవా నమూనాను పునరుద్ధరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అలాంటి 14 కేంద్రాలను నిర్వహిస్తోంది. అదనంగా, OPPO డిజిటల్-నేతృత్వంలోని సెల్ఫ్-హెల్ప్ అసిస్టెంట్ భారత ప్రభుత్వం ‘రిపేర్ హక్కు’ ప్రయత్నానికి మద్దతు ఇస్తోంది. దీనితో వినియోగదారులు సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా స్మార్ట్‌ఫోన్ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది.