
మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా లావణ్య కొత్తగా వచ్చారు. ఈమె పిట్లం మండలంలోని సిద్దాపూర్ గ్రామం నుండి వచ్చినట్లు తెలిపారు ఆమె తండ్రి ఉద్యోగం విధులు నిర్వహిస్తూ.. మృతి చెందిన సందర్భంగా కూతురుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో ఆమె మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.