నవతెలంగాణ – గోవిందరావుపేట
నమ్మిన సిద్ధాంతం కోసం తిధి శ్వాస వరకు పోరాడిన నాయకుడు అంబాల పోశాలు అని సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు అంబాల పోశాలు అంత్యక్రియల కార్యక్రమానికి నాగయ్య హాజరయ్యారు. నాగయ్య మరియు పార్టీ సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డిలు పోశాలు పార్థివ దేహం పై ఎర్రగుడ్డ కప్పి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో నాగయ్య మాట్లాడారు. పోషాలు మరణం ప్రజా ఉద్యమానికి తీరనిలోటు అనీ అన్నారు. అంబాల పోశాలు నమ్మిన సిద్ధాంతం కోసం అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.పోశాలు 1969 నుండి నేటి వరకు సీపీఐ(ఎం) పార్టీలో క్రియాశీల కార్యకర్తగా నాయకుడిగా పని చేశారని తెలిపారు. పెద ప్రజలకు భూమి ,ఇంటి స్థలాలు ,కూలీరెట్లు పెంచాలని అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. అనేక సందర్భాల్లో నిర్బంధాన్ని ఎదుర్కొని జైలు జీవితం అనుభవించాడని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కష్టజీవుల హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఎర్ర జెండా కోసం పరితపించాడని అన్నారు. పార్టీలో కార్యకర్తల్లో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో పోషాలు పాత్ర కీలకమని తెలిపారు. తనతో పాటు తన కుటుంబాన్ని కమ్యూనిస్టు అడుగుజాడల్లో నడిపించారని పార్టీలో ఎంతో నిబద్ధతతో అంకితభావంతో పనిచేశాడని అన్నారు .అలాంటి మహా నాయకుని కోల్పోవడం కమ్యూనిస్టు పార్టీకి కార్మిక వర్గ పేదలకు బడుగు బలహీన వర్గాలకు తీరని నష్టమని అన్నారు .ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగాలని ఆయన చూపిన సమసమాజ లక్ష్యం కోసం సోషలిస్టు సమాజం కోసం పాటుపడడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ , మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరెడ్డి ,చిట్టిబాబు, దావుాద్, జిల్లా కమిటీ సభ్యులు ఆగిరెడ్డి గఫూర్ రాజేష్ రాజేందర్ ప్రవీణ్ మండల కమిటీ సభ్యులు సూర్యనారాయణ కృష్ణారావు ఆదిరెడ్డి రామస్వామి సదానందం కవిత రాజేశ్వరి ఉపేంద్ర చారి,గౌస్ ,ఐలయ్య, శాఖా కార్యదర్శులు జిట్టబోయిన రమేష్ ,పల్లపు రాజు, బ్రహ్మచారి ,సువర్ణ, శ్రీనివాస్ లెనిన్ నాగేష్ అయిలయ్య సారయ్య,నరసయ్య, సంజీవ, మహేందర్ ,ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.