తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) ఊకే నాగేశ్వరరావు తల్లి, ఊకే సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం నాడు దశదినకర్మకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తాడ్వాయి మాజీ జెడ్పిటిసి, రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, గోవిందరావుపేట మండల మాజీ జెడ్పిటిసి ఉప్పుతల కోటి, తాడ్వాయి మాజీ వైస్ ఎంపీపీ పాయం నర్సింగరావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి, కీర్తిశేషులు ఊకే సమ్మక్క చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఊకే సమ్మక్క చాలా మంచి మనిషి అని, అందరి మనలను పొందారని, ఆమె మన మధ్యన లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెండకట్ల కృష్ణ, ప్రసాద్, కోరం చంద్రయ్య ఆ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.