దుస్తుల మీద కాఫీ, టీ మరకలు పడినపుడు త్వరగా వదిలవు. అలాంటి సమయంలో ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువుల ద్వారా వాటిని తొలిగించుకోవచ్చు. అదెలాగంటే….
– కాఫీ పడిన వెంటనే నీళ్లు చల్లితే మరక పెద్దదవుతుంది. అలా కాకుండా టిష్యూ పేపర్ని లేదా దూది ఉండల్ని ఆ మరకలపై ఉంచితే చాలా వరకు అవి పీల్చేస్తాయి. కొద్ది సమయం తర్వాత దుస్తులను ఉతికితే సరి.. మరకలు అంతగా ఏర్పడవు.
– అందుబాటులో ఉండే లిక్విడ్ డిటర్జెంట్‌లు అందుబాటులో ఉంటే కొంచెం వేలితో తీసుకుని మరక పడిన చోట రాయాలి. పావుగంటయ్యాక ఆ ప్రాంతంలో మాత్రమే రుద్ది ఉతికితే సరిపోతుంది.
– తెల్లని దుస్తుల మీద మరక మరీ ఇబ్బందిగా కనిపిస్తుందనుకుంటే.. గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానికి కాసిని వేడి నీరు కలిపి ఈ మిశ్రమంలో స్పాంజిని ముంచి మరక మీద రుద్దాలి. తర్వాత నీళ్ళు పంపు కింద ఉంచితే సరిపోతుంది.
– వెనిగకర్ లో చల్లటి నీళ్లు కలిపి అందులో మరకలు పడిన దుస్తుల్ని నానబెట్టాలి. అరగంటయ్యాక సబ్బుతో ఉతికితే మరక త్వరగా పోతుంది.