కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం..

నవతెలంగాణ – తాడ్వాయి 
కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కొరకు ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటి,ఇంటి కి తిరిగి అందరినీ పరీక్షించి శరీరం మీద స్పర్శ లేని, రాగి రంగు లేక లేత గోధుమ రంగు మచ్చలు గుర్తించి వారి పేర్లు నమోదు చేస్తున్నారని డిపిఎంఓ సంజీవరావు తెలిపారు. ఇందులో భాగంగా మంగపేట, కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గురువారం ముమ్మరంగా లెప్రసీ పరీక్షలు నిర్వహించారు. గుడిసెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు పి.బి కేసులను, మంగపేట పీహెచ్సీ పరిధిలో రెండు పీవీకేసులను గుర్తించారు. ఈ సందర్భంగా డిపిఎం ఓ సంజీవరావు మాట్లాడుతూ కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలన్నారు. కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు ఎదపై నొప్పిలేని బొడిపెలు కనుబొమ్మలు రెప్పల వెంట్రుకలు రాలిపోవడంతో కనురెప్పలు మూతపడకపోవడంతో ముక్కు దిబ్బెడ ముక్కు నుంచి రక్తం రావడం కాళ్ళు చేతులు తిమ్మిర్లు అరికాలు అరిచేతులు స్పర్శ కోల్పోవడం చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించకపోవడం చేతుల నుంచి వస్తువులు జారిపోవడం చేతులు కాలివేలు వంకలు ద్రవం వంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love