నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని మర్రురు గ్రామంలో ఎంపీపీ బచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని దుయ్యబట్టారు. అదేవిధంగా మునిసిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వలిశెట్టి స్వప్న, మండల అధ్యక్షుడు నకిరేకంటి యేసు పాదం, మాజీ సర్పంచ్ నకిరేకంటి నరేందర్, మాజీ ఎంపీటీసీ బరిసెట్టి బాలరాజు, నాయకులు నర్సింగ్ నాగరాజు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.