రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

నవతెలంగాణ -దుబ్బాక 
ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశ ప్రజలకు సమాన స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండల కోఆర్డినేటర్ వెంగళరావు అన్నారు. ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున పిలుపుమేరకు దుబ్బాక నియోజకవర్గం లో జరుగుతున్న “జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర” గురువారం దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి, కమ్మరపల్లి, పెద్ద చీకోడ్ గ్రామాల్లో కొనసాగింది.గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ స్మరించుకున్నారు.మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమసమాజ స్థాపన కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ పాదయాత్రలో కాంగ్రెస్ దుబ్బాక మున్సిపల్,మండల అధ్యక్షులు ఏసురెడ్డి, కొంగర రవి, నరేందర్ రెడ్డి, యూ.రాజిరెడ్డి, పద్మయ్య,దేవేందర్, రాజులు, మంద శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు జనార్దన్ రెడ్డి, రాజిరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love