సేవాలాల్ స్ఫూర్తితో సమాజ సేవ చేద్దాం: ఎమ్మెల్యే 

నవతెలంగాణ -దుబ్బాక
బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ సేవకు నడుం బిగించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పాతులోత్ పెంటమ్మ బాలకిషన్,పలువురు బంజారా నాయకులు కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాజ్యాంగాన్ని వారి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి,పలువురు బీఆర్ఎస్ నాయకులు,గ్రామస్తులు ఉన్నారు.
Spread the love