
అంబేద్కర్ సాక్షిగా వీడీసీలను రద్దు చేసే వరకు పోరాడుదాం అని,తాళ్ల రాంపూర్ లో గీత కార్మికులకు అండగా నిలబడదాం అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ సిఐటియు జిల్లా కమిటీ ఆద్వర్యం లో కార్మికుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ 154 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కార్మికులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్మికులు పూలు వేసి నివాళులు అర్పించారు కార్మికులు అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకొని నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మనువాదాన్ని మట్టి కలపాలని. బిజెపి విధానాలను వ్యతిరేకించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ప్రపంచం లోని 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ నేతృత్వం లోని కమిటీ రచన చేసిందన్నారు.రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్య
,పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిపుష్టం చేశాయని,వీటిని ద్వాసం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదన్నారు.డాక్టర్ అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా,కార్మిక శాఖ మంత్రిగా నెహ్రూ ప్రభుత్వం లో పని చేసిన సందర్భంలో కార్మికులు,పీడిత అణగారిన ప్రజల పక్షాన పని చేసారన్నారు.మహిళల ఆస్తి హక్కు సమస్యపై తన పదవికి సైతం రాజీనామా చేశారని అన్నారు.సామాజిక అణచివేతకు గురవుతున్న దళిత,గిరిజన,వెనుకబడిన, మైనార్టి తదితర తరగతుల కోసం రాజీలేని పోరాటాలు చేశారన్నారు.రాజ్యాంగం స్థానం లో ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం లో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం మనువాద శాస్త్రాన్ని తేవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని,ఇదే మనువాద శాస్త్రాన్ని డాక్టర్ అంబేద్కర్ తగులబెట్టారని అన్నారు.మనువాద శాస్త్రం కుల వ్యవస్తని కొనసాగిస్తున్నదని, సామాజిక అణచివేతకు తోడ్పడే విధంగా ఉంటుందని అన్నారు కులం అనే పునాదులపై ఒక జాతిని కానీ, నీతిని కానీ నిర్మంచలేరని డాక్టర్ అంబేద్కర్ ఏనాడో చెప్పారని అన్నారు.డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు,రాజ్యాంగ పరి రక్షణ కోసం మరిన్ని పోరాటాలు చేయాలని కేంద్ర, రాష్ట్ర పాలక వర్గాలు కార్మిక, ప్రజా వ్యతిరేఖ విధానాలు చాలా వేగంగా అమలు చేస్తూ సామాన్యపై పన్నుల భారం వేస్తూ,కార్పొరేట్లకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారన్నారు. ప్రజల నుండి ఎన్నికైన పాలకులు కార్పొరేట్ల వైపా ? పీడిత ప్రజల వైపా ? తేల్చాలని అన్నారు. అదేవిదంగా తాళ్ల రాంపూర్ లో జరుగుతున్న దారుణాలను చూసి అణగారిన వర్గాలన్నీ కలిసి ఊర్ల నుంచి వీడీసి లను తరిమేద్దాం.