అనాథలకు మనో ధైర్యాన్ని కల్గిద్దాం: ధరణికోట నర్సింహ 

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
పుట్టినరోజు, పెళ్ళిరోజు వేడుకలను అనాదశ్రమంలో జరుపుకొని వారికి మనో ధైర్యాన్ని కల్గిద్దామని  వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు ధరణి కోట నర్సింహ అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి అమ్మ ఒడి అనాదాశ్రమం లో సంస్థ సభ్యులు మచ్చ ఉపేందర్ గౌడ్ కుమార్తె మచ్చ వర్షిణి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాధలకు, వృద్దులకు ఆదారణ కరువైందని ఆయన అన్నారు.  నేటి సమాజంలో మానవత్వం , నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం లాంటివి పిల్లలకు బాల్యం నుంచే నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అమ్మ ఒడి అనాదాశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మచ్చ వర్షిణి ని పలువురు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల పరిరక్షణ సమితి జిల్లా డైరెక్టర్ మచ్చ ఉపేందర్, నాయకులు జాగిల్లపురం అయిలయ్య, ఇంజ పద్మ,  బబ్బూరి రాజు, మచ్చ బాలరాజు, ఆశ్రమం నిర్వాహకురాలు చింతకింది దివ్య, ఆశ్రమం లోని యవకులు, వృద్దులు పాల్గొన్నారు.
Spread the love