తెలంగాణలో మాదిగలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఏకైక డిమాండ్ తో మాదిగ జేఏసి వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వంలో చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కి పిలుపు మేరకు గురువారం చండూరు సెంటర్లో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కురుపాటి సుదర్శన్, సంఘ నాయకులు సంబంధిత కరపత్రంవిడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తారీఖున దేశ రాజధాని నడిబొడ్డు జంతర్ లో మహాధర్నా, 19వ తారీఖున పార్లమెంట్ ముట్టడి చేపడుతున్నామని తెలిపారు. 2014 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్షంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద(100) రోజులలో వర్గీకరణను పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదిస్తామని మాయమాటలతో మాదిగల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట మర్చిపోయిందని అన్నారు.ఈ ఎన్నికల్లో తిరిగి సాక్షాత్తు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి మాదిగల బహిరంగ సభలో పాల్గొని 30 సంవత్సరాల మాదిగల పోరాటానికి శుభం పలికి శుభవార్త చెబుతాడని ఎదురుచూసిన మాదిగ బిడ్డలకు ప్రధానమంత్రి నిరాశే మిగిల్చాగని అన్నారు. పార్లమెంటులో బలం ఉన్నప్పుడు వర్గీకరణ పై బిజెపికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కమిషన్ వేస్తామనటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ పార్లమెంటు సమావేశాలలో వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని సుదర్శన్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇరిగి గురునాథ్, తలారి పరమేష్, బొడ్డు యాదయ్య,మాదిగ సర్పంచుల ఫోరం జిల్లా నాయకులు కరుణశ్రీ రవీందర్, తలారి శ్రీకాంత్, సాగర్, కొమ్ము గణేష్,
దాసరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.