గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దాము: వరిపల్లి అనిల్ కుమార్ 

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్ది గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆ గ్రామ యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ గ్రామస్తులను కోరినట్లు తెలిపాడు. రాజుల కొత్తపల్లి గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్ కిరణ్ శ్రీనివాస్ ల తో కలిసి మత్తుపానియాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రాజుల కొత్తపల్లి గ్రామంలో చిన్న వయసులోనే కొంతమంది గుడుంబాకు బానిసలుగా మారి ప్రాణాలు పోగొట్టుకొని ఎంతోమంది కుటుంబాలు ఇబ్బందుల పాలు అవుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఇంటి యజమాని గుడుంబా తాగి తాగి మృతి చెందితే వారి భార్య పిల్లలు అనాధగా ఏర్పడి వారు ఎంతగానో బాధపడుతున్నారని తెలిపాడు. వారి పిల్లలు చదువులకు మరియు ఇతర విషయాలపై పూర్తిస్థాయిలో తండ్రి అవగాహన కల్పించేవారు. మృతి చెందడంతో ఆ కుటుంబం పిల్లలు భార్య రోడ్డుపాలై కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అటువంటి కుటుంబాలను చూసి ఇలా మన గ్రామంలో ఎవరు కూడా గుడుంబాకు బానిస కావద్దు ఎవరు చనిపోవద్దు. అందరం బాగుండాలి అనే ఉద్దేశంతో గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఎన్నోసార్లు గుడుంబాను తయారు చేయకుండా, ఇతర గ్రామాల నుండి ఈ గ్రామానికి గుడుంబా రాకుండా టాస్క్ ఫోర్స్ అధికారులతో మాట్లాడి ఎక్సైజ్ అధికారులతో విషయాలు చెప్పి మా గ్రామంలో గుడుంబా రాకుండా చేసేందుకు  సహకరించాలని కూరగానే ఆయా శాఖల అధికారులు వీటిపై దృష్టి సారించి, ఈ గ్రామంలో గుడుంబా లేకుండా చేశారని అన్నారు. వారికి మా గ్రామ ప్రజల నుండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామస్తులు ఏకం చేసి మత్తు పానీయాలను గ్రామంలోకి రాకుండా మీరందరూ నాకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. అలా చేసినట్లయితే మన గ్రామం గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దుకొని అన్ని రంగాలుగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపాడు. ఇతర గ్రామ మండలాలకు మన గ్రామం ఆదర్శంగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై కృషి చేయాలని గ్రామస్తులు కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love