మేడారం జాతర.. మావోయిస్టుల లేఖ కలకలం.. 

– భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) లేఖ కలకలం
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర అభివృద్ధి పనులలో నాణ్యత లోపాలను ఎత్తి చూపుతూ, జాతర నిర్వహణ, జాతర అనంతరం తీసుకోవలసిన చర్యలను పెర్కొంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)  జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి ఏరియా కార్యదర్శి వెంకటేష్ సోమవారం లేఖ విడుదల చేసిన మావోయిస్టు లేఖ కలకలం రేపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో ఈనెల 21 నుండి 24 వరకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేస్తుందని హడావుడిగా పనులు ప్రారంభించి నాణ్యత లేకుండా  వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తుందని ప్రభుత్వ తీరును ఎండగడుతూ భారత కమ్యూనిస్టు (మావోయిస్టు) పార్టీ జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వెంకటేష్ లేఖ విడుదల చేశారు.
  సమ్మక్క సారలమ్మలు కాకతీయ రాజులతో పోరాడి వీరోచిత మరణం పొందిన కథను గుర్తు చేస్తూ వనదేవతల జాతరను ఆదివాసి సాంప్రదాయాలతోనే ఘనంగా నిర్వహించాలని, జాతరకు విచ్చేసే భక్తులకు లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాలు అమ్మకుండా బెల్లాన్ని ప్రసాదంగా భక్తులకు అందించాలని అంతేకాకుండా జాతర సమయంలో పంట వేయకుండా నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, జాతర అనంతరం పరిసర ప్రాంతాలలో భక్తులు వదిలేసి వెళ్లిన వ్యర్ధాలను, బ్రాందీ సీసాలను తొలగించి జబ్బులు ప్రబలకుండా, జబ్బున పడిన వారికి చికిత్స అందించే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని  డిమాండ్ లను లేఖలో పేర్కొన్నారు. ప్రతిసారి జాతకాలు లాగానే ఈసారి జాగ్రత్తగా కూడా అన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు స్పందించి నాణ్యతకు తిలోదాకాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకుల పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Spread the love