ఆ వెన్నుపోటు కబాలి.. ఎవరో?

– మంత్రి దుద్దిళ్ల వ్యాఖ్యలతో కబాలి టీమ్ లో మొదలైన వణుకు
– ఆ వెన్నుపోటు దారులపై చర్యలకు సిద్ధం.?
– సోషల్ మీడియాలో వైరల్
నవతెలంగాణ మల్హర్ రావు: తన వెంటే ఉంటూ తనకు, కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేయాలనే పన్నాహం పొంది ప్రత్యర్థితో చేతులు కలిపిన ఆ వెన్నుపోటు దారులెవరో తనకు తెలుసని ఇటీవల కాటారం, మల్హర్ మండలాల్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇంతకు ఆ కబాలి, ఏవరోనేది ఇప్పుడు కాటారం డివిజన్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.ఆ కబాలి టీమ్ పై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కబాలి,మరియు కబాలి టీమ్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మంథని నియోజకవర్గం నుంచి ఐదవసారి శాసన సభ్యుడిగా భారీ మెజార్టీతో ఎన్నికై, తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా మల్హర్, కాటారం మండలాల్లో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీదర్ బాబు చేసిన కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ వెన్నుపోటు దారుల్లో వణుకు మొదలైంది. తన వెంటే ఉంటూ తనకు నమ్మకద్రోహం చేయాలని ప్రత్యర్ధుల చేతిలో కీలుబొమ్మలుగా మారినా వారెవరో తమకు పేరుపేరునా తెలుసని దుద్దిళ్ల పదేపదే వ్యాఖ్యనించడంతో ఆ కబాలి టీమ్ లో వణుకు పుట్టినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ దుద్దిళ్ల ప్రక్కనే ఉంటూ ప్రత్యర్థికి మేలు చేసే కార్యక్రమం ఆ కబాలే చేశాడని, దానికి ప్రతి ఫలంగా భారీగా సొమ్ము సైతం తీసుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇంతటి నమ్మక ద్రోహం చేసిన, అతగాడి టీమ్ తో చేయిస్తున్న వెన్నుపోటు దారులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలకు సిద్ధమైనట్లుగా విశ్వసనీయత సమాచారం. కబాలి టీమ్ పై ఎలాంటి చర్యలు ఉంటాయోని పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెన్నుపోటు పొడిసెందుకు పన్నాహం పొందిన ఆ కబాలి, అతగాడి టీం దారులపై ఇటీవల దుద్దిళ్ల శ్రీనుబాబు సైతం డేగకన్నుతో పసిగట్టినట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి చిడపురుగులను కుకటపు వెళ్ళకానుంచి పీకి పారేయ్యాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love