కాంగ్రెస్ కండువా కప్పుకున్న లక్నవరం సర్పంచ్


నవతెలంగాణ – గోవిందరావుపేట మండలంలోని లక్నవరం పంచాయతీ సర్పంచ్ భూక్య వాణి రాజు నాయక్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో దుంపలగూడెం గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క చేత కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ సర్పంచ్ భూక్య వాణి రాజు నాయక్ కుటుంబం పూర్వం నుండి కూడా కాంగ్రెస్ కుటుంబమని మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడిన తిరిగి సొంతగూటికి చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గ్రామంలో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఆ బలం మరింత పెరిగిందని అన్నారు. సర్పంచ్ భూక్యవాణి రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని గ్రామ కాంగ్రెస్ కమిటీ మరియు కార్యకర్తలు పూర్తిగా స్వాగతించారు. గతంలో కూడా బూఖ్యవాని రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. రెండవసారి ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుపొంది టిఆర్ఎస్ లో పనిచేసినప్పటికీ ఎన్నికల సమీపించడంతో తిరిగి కాంగ్రెస్ సొంత గూటికి చేరుకున్నారు.

Spread the love