గ్రంథాలయాలు విజ్ఞాన ఆలయాలు

నవతెలంగాణ – రాయపర్తి
గ్రంథాలయాలు విజ్ఞాన, వికాస ఆలయాలని ఎస్ఆర్ఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మహబూబ్ నగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గాదె హేమలత రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజ్ఞానాన్ని పంచే భండాగారాలు.. ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలాయాలు గ్రంథాలయాలు అని వ్యాఖ్యానించారు. కంప్యూటర్‌ యుగంలో కూడా పుస్తక పఠనంపై యువత మొగ్గు చూపాలన్నారు. ఇంటర్నేట్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైన నెట్‌లో సెర్చ్‌ చేస్తే సులువుగా దొరుకుతున్నది కానీ పుస్తక పఠనంలో ఉన్న తృప్తి కంప్యూటర్‌ సెర్చింగ్‌లో ఉండదని స్పష్టం చేశారు.  సాంకేతిక ఎంత పెరిగినా ఎన్ని కంప్యూటర్లు వచ్చినా గ్రంథాలయ ప్రత్యేకత కాదనలేదనిదని వివరించారు. పుస్తక పఠనానికి ఉన్నంత ప్రాధాన్యత మరేదేనికి లేదంటారు. అలాంటి పుస్తక పఠనానికి మార్గం సుగమం చేసేవి గ్రంథాలయాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైలారం సర్పంచ్ లేతకుల సుమతి యాదవ రెడ్డి, ఉప సర్పంచ్ లక్కం సురేష్, ఎంపీటీసీ రజిత వీరస్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ సాగర్, సంతోష్ రెడ్డి, ఎలుక పెళ్లి రాణి రాజు, సంధి అమ్మిరెడ్డి, గ్రామ పెద్దలు ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love