ఎల్‌ఐసికి రూ.7,925 కోట్ల నికర లాభాలు

ఎల్‌ఐసికి రూ.7,925 కోట్ల నికర లాభాలుహైదరాబాద్‌ : దిగ్గజ బీమా కంపెనీ ఎల్‌ఐసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.7,925 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.15,952 కోట్ల లాభాలతో పోల్చితే దాదాపు 50 శాతం తగ్గుదలను చవి చూసింది. గడిచిన క్యూ2లో సంస్థ నికర ప్రీమియం ఆదాయం రూ.1,07,397 కోట్లుగా చోటు చేసుకుంది.
గతేడాది ఇదే క్యూ2లో రూ.1,32,631.72 కోట్ల నికర ప్రీమియం నమోదయ్యింది. ఇదే సమయంలో రూ.2,22,215 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.2,01,587 కోట్లగా చోటు చేసుకుంది. క్రితం క్యూ2లో పెట్టుబడులపై నికర ఆదాయం రూ.93,942 కోట్లకు పెరిగింది. ఇది 2022-23లో రూ.84,104 కోట్లుగా నమోద య్యింది. ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు 5.60 శాతంగా ఉండగా.. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి 2.43 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో ఎల్‌ఐసి రికార్డ్‌ స్థాయిలో రూ.17,469కోట్ల లాభాలు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.16,635 కోట్ల లాభాలు నమోదు చేసింది.

Spread the love