
నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో గురువారం 2025-26 సంవత్సరానికి గానూ లయన్స్ కబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. లయన్స్ రీజియన్ చైర్మెన్ పి.లక్ష్మినారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అద్యక్షుడిగా అబ్బాయి లింబాద్రి,కార్యదర్శిగా పెట్టిగాడి రాఘవేందర్, కోశాధికారిగా అంకం రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాద్యక్షులుగా చెన్న రవీంద్రనాథ్ గుప్త,పెట్టిగాడి శ్రీనివాస్, ఎల్.సి.ఎఫ్ కో-ఆర్డినేటర్ గా ఇరుమల శివలింగం,మార్కెటింగ్ చైర్మెన్ గా చింతల గంగాదాస్ జీఎస్టీ కో ఆర్డినేటర్ గా దాసరి రాఘవేందర్ లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా డాక్టర్ డీఎల్ఎన్ స్వామి,రావి నేతాజి, గడ్డం రామకృష్ణారెడ్డి, షేక్ బాషా, డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్, గర్దాస్ శంకర్,డాక్టర్ అంకం గణేష్,డాక్టర్ కృష్ణమూర్తి పవార్, కె.వెంకటేష్, డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్ ఎన్నికయ్యారు. లయన్స్ సేవలను మరింత విసృతపరుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్బాయి లింబాద్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.