సాహితీ వార్తలు

నందిని సిధారెడ్డికి చెన్నకేశవరెడ్డి పురస్కారం
డా||చెన్నకేశవరెడ్డి పురస్కారాన్ని ఈ ఏడాది సుప్రసిద్ధ కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డికి బహూకరిస్తారు. ఈ పురస్కార సమర్పణ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సభకు డా. అమ్మంగి వేణుగోపాల్‌, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డా. ఏనుగు నరసింహారెడ్డి, డా. నాళేశ్వరం శంకరం, ఎం.కె. రాము, ఆచార్య ఎం. శంకర్‌ రెడ్డి, డా. పి.లక్ష్మీనారాయణ, డా.తూర్పు మల్లారెడ్డి, చీకోలు సుందరయ్య, డా. గంటా జలంధర్‌ రెడ్డి, డా. రాయారావు సూర్యప్రకాశ్‌ రావు పాల్గొంటారు.
– డా. రాయారావు సూర్యప్రకాశ్‌ రావు, సంధానకర్త

మేలిమి చింత’ ఆవిష్కరణ

ప్రమోద్‌ ఆవంచ కవితా సంపుటి – ‘మేలిమి చింత’ ఆవిష్కరణ సభ ఏప్రిల్‌ 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్‌లో జరుగుతుంది. సభకు కవి యాకూబ్‌ అధ్యక్షత వహిస్తారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఎన్‌. వేణుగోపాల్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రావూరి చంద్రశేఖర్‌ రెడ్డి (మాజీ ఎం.పి.) విశిష్ట అతిథిగా పాల్గొంటారు. డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, కాసుల ప్రతాప్‌ రెడ్డి, కందుకూరి అంజయ్య, చల్లా రామఫణి, గాజోజు నాగభూషణం. వేదాంత సూరి తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు.
– పాలపిట్ట బుక్స్‌, 9848787284

Spread the love