‘పోకల పలుకులు’ పుస్తక ఆవిష్కరణ
పోకల చందర్ రచించిన ‘పోకల పలుకులు’ పుస్తక ఆవిష్కరణ సభ ఈ నెల 26 ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. పొట్లపల్లి శ్రీనివాసరావు, జె.డి. లక్ష్మీ నారాయణ, కల్వ సుజాత గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త, నెల్లుట్ల రమాదేవి, పెండెం వేణుమాధవ రావు. కీ.శే. పోకల చందర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
యోధ విజయోత్సవ సభ
యోధ – కథాసంకలనం విజయోత్సవ సభ, శ్రామిక మహిళ – అవగాహన సదస్సు ఈ నెల 27 ఉదయం 11 – సాయంత్రం 5 గంటల వరకు ఐలమ్మ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్లో జరుగుతుంది. భండారు విజయ, ఓల్గా, గిరిజ పైడిమర్రి, ఎస్. ఆశాలత, మకాన్, డా.యు.వింధ్య, డా.బి.వి. విజయలక్ష్మి, వి. సంధ్య, సిస్టర్ లిజి, అనూరాధ, అరుణ, జయ, సరస్వతి, ముళ్ళపూడి సుధారాణి, ఉషాసీతాలక్ష్మి, డా .చిలుకా భాస్కర్, బ్రహ్మచారి (నిధి), నాంపల్లి సుజాత, వి శాంతి ప్రబోధ పాల్గొంటారు.
శ్రీ ఊహకు కందికొండ స్మారక జాతీయ పురస్కారం
నెలపాడుపు సాహిత్య సాంస్కతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం 2024 కు కథా రచయిత్రి శ్రీ ఊహ రచించిన ‘బల్కావ్’ కథల సంపుటి ఎంపికైనది. పదివేల నగదును శాలువా మెమోంటోతో ఈ పురస్కారం త్వరలో అందజేయపడుతుంది.
– వనపట్ల సుబ్బయ్య, 9492765358