రైతులందరికీ రుణమాఫీ ఓకే విడుదల చేయాలి: బండ శ్రీశైలం

నవతెలంగాణ – మునుగోడు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీని కట్ అప్ డేటు లేకుండా రైతులందరికీ ఓకే విడతలో రుణమాఫీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఒకే విడతలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వడ్డీ భారం అవుతుందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేందుకు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని అన్ని రకాల పంటలకు బీమాను వర్తింపజేయాలని సూచించారు. రుణమాఫీ చేసిన రైతులకు వెంటనే పంట పెట్టుబడి కోసం కొత్త రుణాలను ఇవ్వాలని అన్నారు . 2024 ఖరీఫ్ సీజన్ సాగుకు  వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుబంధు ను వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని కోరారు. గతంలో పెండింగ్లో ఉన్న రైతుబంధును వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు కోరుకునే అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు గుర్తింపు పొందిన ఫెర్టిలైజర్ల అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పూర్తి బాధ్యతను తీసుకోవాలని అన్నారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులను నివారించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్, వీరమల్లు, కొంక రాజయ్య, ఎట్టయ్య లింగస్వామి తదితరులు ఉన్నారు.
Spread the love