Tuesday, May 26, 2026
E-PAPER
Homeజాతీయంపంజాబ్ లో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికలు

పంజాబ్ లో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్ కౌన్సిళ్లు, 20 నగర పంచాయతీల పరిధిలోని మొత్తం 1,896 వార్డుల కౌన్సిలర్ల ఎన్నిక కోసం మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 35.45 లక్షల మంది ఓటర్లు సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, అంతకంటే ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఎక్కడా పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు నివేదికలు లేవని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సుమారు 32,000 మంది పోలీసులను, 35,000 మంది ఎన్నికల సిబ్బందిని నియమించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -